24-01-2026 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి23 (విజయక్రాంతి): కౌటాల మినీ స్టేడియంలో నిర్వహించిన కౌటాల ప్రీమియర్ లీగ్2 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో జమ్ము భాయ్ సూపర్ కింగ్స్, డా. అంబేద్కర్ బ్లూ టైగర్స్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ సాగగా, జమ్ము భాయ్ సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విజేత జట్టుకు రూ.1,10,000, రన్నరప్ జట్టుకు రూ.55,000 నగదు బహుమతు లు అందచేసి క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందని, గ్రామీణ యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గెలుపుఓటములు సహజమని, ఓటమితో మరిం త పట్టుదల పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క శంకర్, ఉప సర్పంచ్ డబ్బ గోపాల్, మాజీ సర్పంచ్ అదే శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, డబ్బ బాపు, బండి శ్రీనివాస్, రవీందర్ గౌడ్, బండి శైలజ తదితరులు పాల్గొన్నారు.