calender_icon.png 28 November, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

28-11-2025 10:32:26 PM

రేగొండ,(విజయక్రాంతి): అతివేగంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మూర దేశపతి (28) తన స్నేహితుడు రాజ్ కుమార్ తో కలిసి ములుగు జిల్లాకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి గోరి స్మశాన వాటిక దగ్గర గల మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు గుద్దుకొని స్పాట్ లోనే చనిపోయినట్లు వారు తెలిపారు. తన స్నేహితుడు రాజ్ కుమార్ కు తలకు గాయాలై చేతి విరగడంతో వెంటనే స్థానికులు పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కొత్తపల్లి గోరి మండల పోలీసులు తెలిపారు.