28-11-2025 10:38:56 PM
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని 15 గ్రామపంచాయతీలలో రెండో రోజు శుక్రవారం సర్పంచ్ నామినేషన్ లకు 30, వార్డు మెంబర్ కు 54 దాఖలయ్యాయని ముత్తారం ఎంపీడీఓ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుందని సర్పంచ్ లకు వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు సాయంత్రం ఐదు గంటల లోపు నామినేషన్ లు సమర్పించుకొని అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.