calender_icon.png 28 November, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్య చేసుకోబోతున్న తల్లి కూతుర్లను కాపాడిన పోలీసులు

28-11-2025 10:41:43 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని లింగ రాణి భర్త శివశంకర్ 30 కులం ముదిరాజ్ తన భర్త రోజు తాగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు కాదని అడిగితే భార్యను ఆమె బిడ్డను తిడుతూ చెరువులో పడి చావమని ఆమెను రోజు బెదిరించేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఆమె ఫంక్షన్ కి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండగా భర్త కు ఫోన్ చేయగా ఫోన్ లో సంభాషిస్తుండగా తిట్టడం ప్రారంభించాడు.

దాంతో ఆమె మనస్థాపానికి గురై తన కూతురితో సహా తూప్రాన్ పెద్ద చెరువులో పడి చనిపోతానని చెప్పి వెళ్ళిపోయినది. గమనించిన సమీప వ్యక్తులు100 డయల్ కు సమాచారం అందించగా బీసీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రవి, శ్రీకాంత్ లు తక్షణమే స్పందించి తూప్రాన్ చెరువు కట్టపైకి వెళ్లి గాలించగా లింగ రాణి ఆమె బిడ్డ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొనుటకు దిగుతుండగా గమనించిన పోలీసులు ఆమెను ఆపి కాపాడి తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి సముదాయించారు.  తూప్రాన్ ఎస్సై యాదగిరి తన భర్తను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినారు.