17-12-2025 12:35:03 AM
బెజ్జూర్, డిసెంబర్16 (విజయ క్రాంతి): బెజ్జూర్ తలాయి గ్రామంలో మద్యం నిషేధానికి యువతతో పాటు గ్రామ ప్రజలంతా ఏక తాటిపై నిలిచారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సాయికిరణ్‌ను కలిసి గ్రామంలో మద్యం నిషేధం అమలు చేయాలంటూ గ్రామ యువకులు తీర్మానం చేసి వినతిపత్రాన్ని అం దజేశారు .
గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసై కుటుంబాలు వీధిన పడుతున్నాయని, దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ పరిస్థితిని నివారించేందుకు గ్రామ ప్రజలందరూ కలిసి మద్యం నిషేధం అమలు చేయాలని సర్పంచ్‌ను కోరారు.అదేవిధంగా వినతిపత్రాన్ని బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషాకు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.