calender_icon.png 17 December, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యం చాటిన మానవమూర్తి

17-12-2025 12:36:10 AM

బ్రహ్మంగారి ఆలయానికి రూ2.50 లక్షల విరాళం

నిర్మల్, డిసెంబర్ 1౬ (విజయక్రాంతి): హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నిర్మ ల్ జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జు మన్ అలీ మంగళవారం మతసామరస్యాన్ని చాటారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునర్ ప్రతిష్టాపన పనుల కోసం రూ. 2.50 లక్షల విరాళాన్ని అందించి మానవతను చాటుకున్నారు.

బ్రహ్మంగారి ఆలయానికి విరాళం అందించిన గ్రంథాలయ చైర్మన్‌ను నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సోదరులు సం ఘ సభ్యులు ప్రత్యేకంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ రాకేష్ రమణ కోటగిరి గోపి మేడారం ప్రదీప్ ముప్పిడి రవి  జగదీష్ తదితరులు ఉన్నారు.