06-07-2024 02:46:09 PM
హైదరాబాద్: మాదాపూర్ లో ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని స్వప్నవర్మగా గుర్తించారు. ఆర్థిక సమస్యలతో స్వప్న ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వప్నవర్మ నిర్మాతకు అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.