calender_icon.png 13 November, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాకు యువత బానిస

12-11-2025 12:00:00 AM

నేటి యువత సోషల్ మీడియా మత్తులో మునిగితేలుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సులభతర విధానంలో డబ్బులు సంపాదించాలనే మోజులో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లోకి ప్రవేశించి పందేళ్లో  రూ.వేల నగదు పోగొట్టుకుంటున్నారు. అందుకోసం తొలుత బంధువులు, తెలిసినవారి వద్ద అప్పులు చేయడం, నగదు కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం చేస్తున్నారు.

ఆ తర్వాత కట్టాల్సిన బకాయిలు పెరిగిపోతుండడంతో చోరీలకు పాల్పడుతున్న యువత పోలీసులకు చిక్కుతున్నారు. అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌తో సమస్త ప్రపంచాన్ని వీక్షించే అవకాశమొచ్చింది. కొంతమంది దానిని సక్రమ మార్గంలో వినియోగించుకుంటుంటే.. మరికొందరు మాత్రం క్రికెట్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ వైపు మళ్లుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో ఏర్పడుతున్న పరిచయాల కారణంగా మత్తు మందు, గంజాయి, మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టబడుతున్నారు. దాదాపు 8 నుంచి 10 గంటల పాటు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతూ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు వచ్చిన తర్వాత పోలీసులు నిఘా పెట్టి పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఐపీఎల్ సమయంలో పెద్దఎత్తున బెట్టింగ్‌లలో యువత భారీ ఎత్తున నగదు పోగొట్టుకున్నారు.

రూ.లక్షల అప్పు చేసి తీర్చలేక బలవన్మరణాలకు పాల్ప డు తూ తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగుల్చుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టి దారితప్పక ముందే వారు స న్మార్గంలో నడిచేలా చూడాలి. మంచి, చెడుల గురించి వివరంగా చెప్పాలి. సా నుకూల దృక్పథంతో ఆలోచించేలా ఉండాలి.

 సతీశ్ రెడ్డి, వరంగల్