12-11-2025 12:00:00 AM
ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం ఒక కారులో బాంబు పేలుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిం ది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. నిత్యం పటిష్ట భద్రతా వ్యవస్థ ఉండే ఈ ప్రాంతంలో బాంబు దాడి జరగడం చూస్తే ఇది ఉగ్రచర్యే అన్న సంగతి ప్రత్యేకంగా చె ప్పనవసరం లేదు. ఎందుకంటే గడిచిన వారం రోజుల వ్యవధిలో ఉగ్రవాద వ్యతిరేక బృందాలతో కలిసి గుజరాత్, హర్యానా, జమ్మూ కశ్మీర్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి ఉగ్ర కుట్రలో అనుమానితులుగా ఉన్న నలుగురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుం చి 2900 వందల కిలోల పేలుడు పదార్థాలను, రైఫిళ్ళు, పిస్టల్స్, రైసిన్, అమోనియం నైట్రేట్ వంటి విష పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఉగ్రకుట్ర బట్టబయలు కావడంతో తా ము బయటపడతామేమోనన్న భయంతో పుల్వామాకు చెందిన డాక్టర్ ఫరీద్ ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అ నుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
మొన్నటిదాకా సూసైడ్ బాంబర్స్, స్లీపర్ సెల్స్ పేర్లతో పేద, మధ్య తరగతి యువతకు డబ్బు ఆశ చూపి వారి బ్రెయిన్లను వాష్ చేసి దేశంలో అలజడి సృష్టించాలని కుట్రలు చేసే టెర్రర్ గ్రూ ప్‌లు ఇప్పుడు కొత్త దారులు వెతుకుతున్నాయనిపిస్తున్నది. గౌరవప్రదమైన వృత్తిగా పేర్కొనే డాక్టర్లు ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితు లవు తున్నట్లు తాజాగా ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు, ఫరీదాబాద్‌లో ఉగ్ర లింకులను బేరీజు వేసుకొని చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి.
ఢిల్లీ ప్రాంతంలోని ఫరీదాబాద్‌లో ఆల్ ఫలాయ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ ముజమిల్ షకీల్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రధర్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహమ్మద్ మోహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్‌కు చెంది న మహిళా డాక్టర్ షాహిన్‌ను ఉగ్రవాద వ్యతిరేక పోలీసుల బృందం అరె స్ట్ చేసింది. కాగా అరెస్ట్ అయిన వైద్యులంతా జైషే మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది.
వీరంతా వృత్తి రిత్యా డాకర్లు కాబట్టి ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతోనే ఉగ్రవాద సంస్థలతో నిత్యం టచ్‌లో ఉండేవారని తెలుస్తోంది. పేరున్నవారు, ఉన్నత విద్యావంతులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన ఉగ్రవాదులు చారిటీలు, విద్యా సంస్థలకు నిధుల సేకరణ ముసుగులో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు తెలు స్తోంది. ప్రొఫెషనల్ పని చేస్తూనే.. ఉగ్రవాదం వైపు మళ్లిన డాక్టర్ల దుర్మార్గాన్ని ‘వైట్ కా లర్ టెర్రరిజం’ అని పిలుస్తున్నారు.
వీళ్ల అండతో జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థలు దారుణమైన పనులకు పాల్పడుతున్నాయి. 1990లో మనదేశంలో చోటు చేసుకున్న పేలుళ్ల అనంతరం ఈ ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించాయి. దాదాపు 35 సంవత్సరాలుగా ఉగ్ర సంస్థలు రూపాన్ని మార్చుకుంటూ వస్తున్నాయి. సైబర్, ఫైనాన్షియల్, బయో టెర్రర్ వంటి పేర్లతో ఉగ్రభూతం పంజా విసురుతూనే ఉంది.