16 April, 2026 | 5:56 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

దుండిగల్ తాసీల్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

15-10-2025 01:19 AM

తన భూమిని బడా నిర్మాణ సంస్థకు కట్టబెడుతున్నారని ఆరోపణ

కుత్బుల్లాపూర్, అక్టోబర్ 14(విజయక్రాంతి): తన భూమిని బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఓ యువకుడు దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. దుండిగల్ తండా 1 కు చెందిన సిద్దుకు,సర్వే నెంబర్ 148,150లో కొంత భూమి ఉంది. అయితే గతంలో పాస్ బుక్‌ల కోసం 6 లక్షలు డిమాండ్ చేశారని, అందుకే తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడు సిద్దు నాయక్ ఆరోపించాడు.

డబ్బులు ఇవ్వనందుకే తమకు పాస్ బుక్‌లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కోర్ట్ ఆర్డర్ కాపీ కూడా ఉందని, గతంలో తహసీల్దార్ కు అందజేశానని తెలిపాడు. తహసీల్దార్ ను పాస్ బుక్ లు ఇవ్వండని అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.ఆ భూమిపై తమ కుటుంబం ఆధారపడి ఉందని, పాస్ బుక్ లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.