15-10-2025 01:19:31 AM
-షాద్‌నగర్ ఎసిపి లక్ష్మినారాయణ
తలకొండపల్లి, అక్టోబర్ 14: ప్రజలు నేరారోపనలతో చేసే ఫిర్యాదులపై ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని షాద్ నగర్ ఎసిపి ఎస్ లక్ష్మినారాయణ పోలీసులకు సూచించారు.వార్షిక తనిఖీలలో భాగంగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను షాద్ నగర్ ఎసిపి ఎస్ లక్ష్మినారాయణ మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విదుల గురించి అడిగి తెలుసుకున్నారు.అందరు సిబ్బంది క్రమశిక్షణ,సమయాపాలన,నిబద్దత కలిగి ఉండాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిదిలో ఉన్న రౌడీషీట్స్,హిస్టరీ షీట్స్,సస్పెక్ట్స్ షిట్స్ లిస్ట్ ను తనీఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.కొత్తగా రౌడీషిట్స్ లో ఎవరైన ఉంటే ప్రపోజల్స్ పంపించాలని ఆదేశించారు.కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిసి కెమరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలలో సిసి కెమరాలు ఏర్పాటు చేసుకునే విదంగా చూడాలన్నారు.నేర దర్యప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సీసీఎన్టీఎస్ అప్లికేషన్ లో డేటాను ఎప్పటికప్పుడు నమోదుచేయాలని,బాదితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ప్రణాళికతో విదులు నిర్వహించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్ సీఐ జానకిరాంరెడ్డి,ఎస్సులు శ్రీకాంత్,శేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.