6 August, 2026 | 7:24 PM

పెళ్లి కాక మనస్తాపం.. యువకుడి బలవన్మరణం

06-08-2026 05:57 PM

కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వేముల కుమార్ (29) అలియాస్ పంతులు కొంతకాలంగా మద్యానికి బానిసై ఎలాంటి ఉపాధి లేకుండా ఉంటున్నాడు. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం తన గదిలో నిద్రించేందుకు వెళ్లిన కుమార్, గురువారం ఉదయం ఇంటి ముందు గదిలో సీలింగ్‌కు నైలాన్ చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడి అన్న వేముల లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదులో, పెళ్లి కాకపోవడం వల్ల మనస్తాపానికి గురై తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.