calender_icon.png 18 November, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన

18-11-2025 12:00:00 AM

 ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 వెల్దండ నవంబర్ 17;  రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణలో పరిపాలన సాగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొండకత్వ చెరువులో చేప పిల్లలను వదిలి 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆకాంక్షించిన ప్రజా రంజక పాల సాగుతుందని పార్టీల కతీతంగా నిరుపేద లకు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. మాటలు చెప్పే ఎమ్మెల్యేలు కాదని చేతల ఎమ్మెల్యేని పనులు కాకుంటే ప్రశ్నించి పనులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, ఉప తహసిల్ కిరణ్ కుమార్,  నాయకులు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజిసింగ్, భూపతిరెడ్డి, మోతిలాల్, పర్వత్ రెడ్డి, సంజు కుమార్ యాదవ్, రాణి, వెంకటయ్య గౌడ్, నారాయణ, రాజశేఖర్, కృష్ణ  పాల్గొన్నారు