calender_icon.png 15 July, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాణామతి చేస్తున్నాడని యువకుడి హత్య

15-07-2025 12:09:24 AM

 నిందతుల అరెస్టు.. రిమాండ్

జహీరాబాద్, జూలై 14 :జహీరాబాద్ పట్నంలో యువకుని హత్య కేసు సంచలనం సృష్టించింది. జహీరాబాద్ పట్టణానికి చెందిన తాజద్దీన్ ను అతి కిరాతకంగా హత్య చేసి బావిలో పడేసిన సంఘటన పోలీసులు చేధించారు. సోమవారం జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సైదా నాయక్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణానికి చెందిన తాజుద్ధిన్ బాణామతి చేస్తున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని కక్షగట్టి మహ్మద్ ఖురేషి, షేక్ హసన్ అక్బర్ అనే వ్యక్తులు హత్య చేసినట్లు తెలిపారు.

చెన్నారెడ్డి నగర్ కాలనీ వెనుక గల చెరుకు తోటలోకి తీసుకెళ్ళి కాళ్ళు, చేతులు కట్టేసి హింసించారని, వారితో తెచ్చుకున్న కమ్మకత్తితో మెడ భాగంలో నరకడంతో తాజుద్ధిన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. చీకటి పడిన తర్వాత కారులో శవాన్ని తీసుకొని కంపెనీ సమీపంలోని రహమత్ నగర్ శివారులో గల పాడుబావిలో పడేశారని తెలిపారు. మరునాడు నిందితులు పోలీస్ స్టేషన్ వచ్చి లొంగిపోయినట్లు చెప్పారు. సోమవారం వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ శివలింగం, ఎస్త్స్ర వినయ్ కుమార్ ఉన్నారు.