24-01-2026 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జనవరి 23 (విజయక్రాంతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో డి.సి.పి. ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సి పల్ కమిషనర్లు, సం బంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివార ణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నా రు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.