calender_icon.png 19 May, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదినాగూడలో ఘనంగా బొడ్రాయి ప్రాతిష్టాపన మహోత్సవం

19-05-2025 12:41:32 AM

ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గాంధీ 

శేరిలింగంపల్లి, మే 18:హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడ గ్రామంలో జరిగిన శ్రీనాభిశీల (బొడ్రాయి) ప్రాతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామ పెద్దలు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రతి గ్రామంలో బొడ్రాయిని పూజించే సంప్రదాయం మన పూర్వీకుల నుంచి వస్తుందన్నారు.

గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి అభశుభాలు జరుగకుండా ఉండలని పూర్వకాలంలో మన పెద్దలు బొడ్రాయిని ప్రతిష్టించే వాళ్ళని గుర్తుచేశారు. అమ్మవారి ఆశీర్వదాం ప్రజలపై ఎల్లప్పుడు ఉండలని వేడుకున్నట్లు తెలియచేసారు.ఆపదలో ఉన్నప్పుడు గ్రామ దేవతలే తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని పల్లె ప్రజలు విశ్వసిస్తారు.

అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. ఏటా కొలుపులు,పూజలు చేస్తారు. ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతాలకు అతీతంగా జాతర  జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, దాత్రి నాథ్ గౌడ్, యాదగిరి, జనార్దన్,మల్లేష్, మల్లేష్ యాదవ్, కృష్ణ, నరేందర్ బల్లా గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.