4 April, 2026 | 5:44 PM

యువత సన్మార్గంలో పయనించాలి

04-04-2026 04:08 PM

* ఎస్సై టివిఆర్ సూరి

మంగపేట,(విజయక్రాంతి): చెడు వ్యసనాలకు దూరంగా ఉండి యువత సన్మార్గంలో పయనించాలని మంగపేట ఎస్ఐ టి.వి.ఆర్.సూరి అన్నారు. మంగపేట మండలంలోని తొండ్యాల గ్రామ యువకులకు  హోప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మంగపేట ఎస్ఐ టి.వి.ఆర్.సూరి చేతుల మీదుగా మంగపేట పోలీస్ స్టేషన్లో శనివారం వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై టి.వి.ఆర్.సూరి మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని అన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమికొట్టడంలో ముందు ఉంటూ మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు.