25-03-2025 12:11:35 AM
తుంగతుర్తి, మార్చి 24: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తి గా విఫలమైందని ప్రజలు వాటికోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని వెంట నే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 26వ తేదీన సూర్యపేట జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.
ఈరోజు వెంపటి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇం టింటా సర్వే చేసి తెలుసుకొని ఆ ఆ గ్రామ పార్టీ శాఖ సమావేశంలో మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు ప్రభుత్వం ఇచ్చే హామీల కోసం ఎదురుచూస్తున్నారని వంటగ్యాస్కు 500 కి ఇస్తామన్న హామీ అమలు కావడం లేదని, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇవ్వడం లేదని, రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం మొదలు కాలేదని, ఎస్సారెస్పీ కాలువ నీరు సరిగా అందించక వేసిన పంట లు ఎండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు అర్హత కలిగిన వారి కి ఇల్లరు నిర్మించాలని, పింఛన్లు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని అన్నారు