calender_icon.png 11 July, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ గుంతలమయం

11-07-2025 12:00:00 AM

  1. మరమ్మత్తులు చేపట్టని అధికారులు 
  2. ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం 
  3. ప్రజలకు శాపంగా మారిన గుంతలు నిత్యం అవస్థలు పడుతున్న పట్టణ ప్రజలు 
  4. మరమ్మత్తులు చేపడుతున్నమంటున్న కమిషనర్ 

బాన్సువాడ, జూలై 10 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్స్వాడ లో రోడ్లన్నీ గుంతల మాయం గా మారాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతో పట్టణంలోని సంగమేశ్వర కాలనీ, బేతాళ కాలనీ, పాత బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి, కొత్త బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి తోపాటు కొత్త కాలనీలో రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి.

మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ, అధికారులకు పట్టణ ప్రజలు గుంతల అనుపూర్చాలని కోరుతున్న పట్టించుకోవడం లేదు. మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారుల సమన్వయ లోపం పట్టణ ప్రజలకు శాపం గా మారింది. వర్షాకాలం వచ్చిందంటే గుం తలలో నీరు చేరి నడిచేందుకు వీలు లేకుం డా పట్టణంలోని కొత్త కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ద్విచక్ర వాహనాలపై వెళ్లిన వారు సైతం స్కిడ్ అయి పడుతున్నారు. నడుచుకుంటూ వెళ్లేవారు సైతం ఇబ్బందులు పడుతూ కాలుజారి కింద పడుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్న మున్సి పల్ అధికారులు, పట్టించుకోవడం లేదు. గతంలో మున్సిపల్  పాలకవర్గం ఉన్నప్పుడు వర్షాకాలం కొత్త కాలనీలలో ఎంతో కొంత తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టేవారు.

ప్రస్తుతం అధికారుల పాలనలో మున్సిపల్ శాఖ ఉన్న ముందుచూపులేని అధికారుల వైఖరి వల్ల నిత్యం ప్రజలు అవసరం పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతున్నారు. 

పాత బాన్సువాడ రోడ్డులో నరకయాతన 

బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది.నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ లలో నివసించే వారు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే గుంతల మయంగా ప్రధాన రోడ్లతో పాటు కాలనీలో ఉన్న  రోడ్డుపై వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలి. 

 సంగమనీ,  గృహిణి, పాత బాన్సువాడ, 

మున్సిపల్ అధికారులు స్పందించాలి 

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ లో కొత్త కాలనీలో రోడ్లన్నీ గుంతల మయం అయ్యాయి. మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్న పట్టించుకోవడం లేదు. మోటార్ సైకిల్ పై వెళ్లేవారు స్కిడ్ డై బురదలో పడి గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి గుంతలను పూడ్చాలి.

వొ కుండని గంగారం, బాన్సువాడ,