16 August, 2026 | 2:03 PM

Districts - Ranga Reddy

article_51811300.webp
గ్రామ కార్యదర్శి శేఖర్ కు ఉత్తమ ప్రతిభ అవార్డు

అవార్డు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంత్రి శ్రీధర్ బాబు. చేవెళ్ల, (విజయక్రాంతి): భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 2025-26 సంవత్సరానికి గాను వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాలో నలుగురు ఎంపికయ్యారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి న్యాలట గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఎంపికకాగా శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. గ్రామంలో సానిటేషన్ ప్రజా చైతన్య కార్యక్రమాలు తడి పొడి చెత్త వేరు చేసే విధానంలో ఉత్తమ ప్రతిభ కనబరచగా సెలక్షన్ కమిటీ టీం డిపిఓ వీరి పేర్లను కలెక్టర్కు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి శేఖర్ ఉత్తమ ప్రతిభ అవార్డుకు ఎన్నికయ్యారు.

16-08-2026