calender_icon.png 30 January, 2026 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4 చెక్‌సోస్టులు: ఎస్పీ డాక్టర్ వినీత్

30-01-2026 12:54:38 AM

నారాయణపేట క్రైం, జనవరి 29 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు.ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల తరలింపును అరికట్టే ఉద్దేశంతో జిల్లాలో మొత్తం 04 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

వాటిలో రెండు అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు

1)కృష్ణ బ్రిడ్జ్ చెక్పోస్ట్ కృష్ణ.,2)జలాల్పూర్ చెక్పోస్ట్ నారాయణపేట,రెండు అంతర్ జిల్లా చెక్పోస్టులు,3) లాల్కోటా మరికల్,4) సంపల్లి కోస్గి పోలీస్ స్టేషన్ పరిధి ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా 08 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, అవి 04 FST ఫ్లయింగ్ స్కాడ్ టీం, 04 SST స్టాటటిక్ సర్వే లైన్స్ టీం లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇవి ఈ చెక్పోస్టుల వద్ద, జిల్లా పరిధిలో ఎన్నికల నిబంధనల మేరకు వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) పూర్తిగా అమల్లో ఉన్నందున, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు అందరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. ఎన్నికల సమయంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.