calender_icon.png 31 January, 2026 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫింగర్ ప్రింట్ డివైస్‌తో తనిఖీ : ఎస్‌ఐ వెంకటేశ్వర్లు

31-01-2026 12:00:00 AM

నారాయణపేట క్రైం.జనవరి,30: నారాయణపేట జిల్లా కేంద్రంలో ముందస్తు నేరా ల నియంత్రణలో భాగంగా దొంగతనాల నివారణే లక్ష్యంగా, అనుమానిత వ్యక్తులను, పాత నేరస్తులను గుర్తించడానికి బ్లూ కోరట్స్ పోలీసులు రవి, హనుమంతు లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాలలో, బ్యాంకు ల వద్ద పోలీసులు న రసింహ అకస్మికంగా ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించారు.

అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తగిన రీతిలో పరిశీలించి, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఫింగర్ ప్రింట్ డివైస్ తో వ్యక్తుల వే లిముద్రలు సేకరించి క్రిమినల్ రికార్డులతో సరి పోల్చారు. పౌరులు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి స మాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు.