calender_icon.png 30 January, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

30-01-2026 12:57:28 AM

మద్దూర్, కోస్గి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నారాయణపేట క్రైం, మద్దూరు/కోస్గి,జనవరి 29: జిల్లాలోని మున్సిపాలిటీలలో నామి నేషన్ల ప్రక్రియ ను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రెండో రోజు గురువారం ఆయా ము న్సిపాలిటీలలో నామినేషన్లు ఎక్కువ సంఖ్య లో దాఖలు అయ్యో అవకాశం ఉందని, అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గురువారం కలెక్టర్ జిల్లాలోని మద్దూరు, కోస్గి మున్సిపాల్టీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కేంద్రాల్లోని ఆర్వోలకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రి యలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు.

హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కేంద్రాల్లో నామినేషన్ల పత్రాలను తెలుగు తో పాటు ఇంగ్లీష్ బాషలో ఉన్నవి కూడా అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని వార్డుల ఓటరు జాబితాలను ఉం చుకోవాలన్నారు. తొలి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయని ఆర్ వో లను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన నామినేషన్లను ఎప్పటికప్పుడు స్కాన్ చేసి టీ పోల్ అప్ లోడ్ చేయించాలని కమిషనర్ల ను ఆదేశించారు. ఫ్రీ స్క్రూటినీ, హె ల్ప్ డెస్క్, నో డివ్ సర్టిఫికేట్ సెంటర్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆయా మున్సిపాలిటీ లకు వంద మీటర్ల దూ రంలోనే వాహనాలు నిలిపి అభ్యర్థులు వచ్చేలా పోలీసులు భద్రత చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట ఒక ప్రతిపాదకుడు, ఒక సాక్షి మొత్తం ముగ్గురికీ మాత్రమే కేంద్రం లోపలికి అనుమతించాలని కమిషనర్లకు సూచించారు. కోస్గి మున్సిపాలిటీ పై అంతస్తు భవనంలో భద్ర పరిచిన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. కోస్గి లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల కమిషనర్లు శ్రీకాంత్, నాగరాజు, మేనేజర్లు, ఇంజనీర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.