calender_icon.png 31 January, 2026 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి

31-01-2026 12:00:00 AM

 ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య

నారాయణపేట క్రైం, జనవరి 30 : రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓల్ బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ ఎ స్‌ఐ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం, హెల్మెట్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా రహదారులపై ప్ర యాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్ లే కుండా ప్రయాణం ప్రమాదం అని అన్నారు. హెల్మెట్ మీ తలకే కాదు మీ కుటుంబ భవిష్యత్తుకూ రక్షణ. అని హెల్మెట్ ధరించండి సురక్షితంగా ఇంటికి చేరండి.

అనే స్లొగన్స్ ద్వారా అవగాహన కల్పించారు..రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా కేంద్రం లో నిరంతరం కొనసాగించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచుతామని ట్రాఫిక్ ఎస్‌ఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.