అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

11-11-2026 | 08:02pm

బొలెరో వాహనం స్వాధీనం.. డ్రైవర్ పోలీసుల అదుపులో

బోధన్, నవంబర్ 11 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) బియ్యాన్ని(PDS Rice) ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో బియ్యంతో పాటు తరలింపునకు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబాద్ నుంచి ధర్మాబాద్‌కు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు నవీపేట ఎన్ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ పవన్ కుమార్, నవీపేట పోలీసులతో కలిసి బుధవారం బాసర ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. 

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడిన వాహనం, డ్రైవర్‌ను తదుపరి చర్యల నిమిత్తం నవీపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎన్ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ పవన్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు