దేవునిపల్లి రథోత్సవానికి భారీ పోలీసు బందోబస్తు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ యాదవ్
పెద్దపల్లి, నవంబర్ 29(విజయక్రాంతి): పెద్దపల్లి మండలం(Peddapalli Mandal) దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం(Sri Lakshmi Narasimha Swamy Rathotsavam) సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ వెల్లడించారు.
భక్తులకు(devotees) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బందిని కీలక ప్రాంతాల్లో నియమించినట్లు తెలిపారు. రథోత్సవం ప్రశాంతంగా జరిగేలా వాహనాల రాకపోకలు, భక్తుల(devotees) రద్దీని నియంత్రించడంతో పాటు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి రథోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఏసీపీ సూచించారు.