అనారోగ్య బాధితుడికి మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక భరోసా
దామా అంజి వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు
ముత్తారం, నవంబర్ 13(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో(NIMS Hospital) చికిత్స పొందుతున్న ముత్తారం మండలం(Muttaram Mandal) అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దామా అంజికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) అండగా నిలిచారు. ఆయన వైద్య చికిత్స(Medical treatment) ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Ministers Relief Fund) (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు.
వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి ఎల్ఓసీ మంజూరుకు చొరవ తీసుకున్నారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు.
ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దామా అంజి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.