రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం
మచ్చుపేటలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మాజీ జడ్పీటీసీ సదానందం
ముత్తారం, నవంబర్ 13(విజయక్రాంతి): రైతులు(Farmers) ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Grain purchasing centers) ఏర్పాటు చేస్తోందని ముత్తారం(Muttaram) మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పేర్కొన్నారు. మండలంలోని మచ్చుపేట గ్రామంలో(Macchupeta Village) ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలివేరి జ్యోతి లక్ష్మణ్ తో కలిసి సదానందం ముఖ్య అతిథులుగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సదానందం, సర్పంచ్ జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. రైతులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు గ్రామపంచాయతీ తరఫున సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, మాజీ సర్పంచ్ గోవిందుల ఆనంద్, ఉపసర్పంచ్ దొంతుల రాకేష్, వార్డు సభ్యులు కళావేనా దేవరాజ్, డైరెక్టర్ బుచ్చవరావు, ఏపీఎం స్వరూప రాణి, సీసీలు తిరుపతి, ఎల్లమ్మ, సీఏ కోమలత, దుండే సతీష్, ఐకేపీ సిబ్బంది, రైతులు, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.