సుల్తానాబాద్ లో బీజేపీ నాయకుల అరెస్ట్

17-11-2026 | 08:51pm

సుల్తానాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ ముందస్తు అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామికమని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ గౌరవం, సమగ్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేగోళం శ్రీనివాస్ గౌడ్,కొల్లూరి సంతోష్ కుమార్, చిట్టవేణి సదయ్య, ఓజ్జా సతీష్, మారం రమేష్, ఈర్ల ప్రశాంత్, మ్యాదరవేణి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు