బడంగ్‌పేట్.. ‘కోట్ల’ కుంభకోణం

05-11-2026 | 05:20am

అధికారులపై వేటు ఓకే.. 

మరి ప్రజాధనం రికవరీ ఏదీ?

  1. తాత్కాలిక సస్పెన్షన్లతో చేతులు దులుపుకొన్న ఉన్నతాధికారులు
  2. కాంట్రాక్టర్లపై విచారణేది..?
  3. ప్రజాధనం కక్కించేది  ఎప్పుడు? 
  4. నిలదీస్తున్న స్థానికులు

బడంగ్‌పేట్, నవంబర్ 4 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో(GHMC Badangpet Circle Office) గత ఆరు నెలల క్రితం వెలుగుచూసిన ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల(Engineering and Sanitation departments) అవినీతి అక్రమాల(corruption and irregularities) వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో డిప్యూటీ కమిషనర్తో పాటు ఏకంగా 9 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే, ఉన్నతాధికారులు ఈ సస్పెన్షన్లతో తమ పని పూర్తయిందని భావిస్తున్నారే తప్ప, అడ్డదారి పట్టిన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తిరిగి రాబట్టడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కనీస అనుభవం లేని వారికి కోట్ల కాంట్రాక్టులా?

ఈ అవినీతి వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ‘ఏడాది అనుభవం కూడా లేని కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 13 కోట్ల విలువైన పనులను ఎలా కట్టబెట్టారని... నిబంధనల ప్రకారం కోట్ల బడ్జెట్ ఉన్న పనులను కేటాయించే ముందు కాంట్రాక్టర్ల అను భవం, గత పనితీరు, సాంకేతిక అర్హతలను కఠినంగా పరిశీలించాలి. కానీ బడంగ్పేట్ సర్కిల్లో అధికారులు కాసుల కక్కుర్తితో నిబంధనలన్నింటినీ గాలికి వదిలేసి, అర్హత లేని వారికి, నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల పనులను అప్పగించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సస్పెన్షన్లు సరే.. రికవరీ నోటీసులు ఏవి?

అవినీతికి పాల్పడిన అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం వరకు బాగానే ఉన్నా, దారిమళ్లిన ప్రజాధనాన్ని రికవరీ చేయడంలో ఉన్నతాధికారులు ఎందుకు వెనకడు గు వేస్తున్నారు? సస్పెన్షన్ అనేది కేవలం ఒక తాత్కాలిక పాలనాపరమైన చర్య మాత్రమే. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన సొమ్మును సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి ఎప్పుడు రికవరీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎవరికీ రికవరీ నోటీసులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం అధికారు లను సస్పెండ్ చేసి వదిలేస్తే సరిపోదు. అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును గుంజిన కాంట్రాక్టర్లపై కూడా సమగ్ర విచారణ జరిపి, వారిని వెంటనే బ్లాక్లిస్ట్లో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల పన్నుల సొమ్ము కక్కించాల్సిందే..

బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో ఆస్తిపన్ను, ఇతర పన్నుల రూపంలో సామాన్య ప్రజలు చెమటోడ్చి చెల్లించిన కోట్ల రూపాయల సొ త్తు కొందరి అక్రమార్కులు, అవినీతి అధికారుల జేబుల్లోకి వెళ్లడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంలో వెనుకుండి నడిపించిన తెరవెనుక నాయకులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై థర్డ్ పార్టీ లేదా స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిపించాలి.

అడ్డదారిలో పక్కదోవ పట్టిన దాదాపు రూ.13 కోట్ల ప్రజా ధనాన్ని అధికారులతో పాటు కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేసి అయినా వెంటనే రికవరీ చేసి, ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టకుండా, బాధ్యులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి.

అక్రమాలకు సహకరించిన కాంట్రాక్టు సంస్థల లైసెన్సులను రద్దు చేసి, భవిష్యత్తులో ఎలాంటి టెండర్లలో పా ల్గొనకుండా బ్లాక్లిస్ట్లో చేర్చాలి. పాలకులు, ఉ న్నతాధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వది లి స్పందించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజాధనాన్ని తక్షణమే రికవరీ చేయాలని బడంగ్‌పేట్ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు