పసలేని ఆరోపణలు

07-10-2026 | 05:25am

కాంగ్రెస్‌ది వారసత్వ రాజకీయ రక్షణోద్యమం

బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శ

అక్టోబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ నిరసనలు(Congress protests) ప్రజాస్వామ్య పరిరక్షణకు(Protection of Democracy) కాదని, ఒక కుటుంబ వారసత్వ రాజకీయాలను(Family succession politics) కాపాడుకునే ఉద్యమమని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్(K. Laxman) విమర్శించారు. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్‌లో ఒకే కుటుంబ ఆధిపత్యం కొనసాగిందని పేర్కొన్నారు. ఈమే రకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2014, 2019, 2024లో ప్రజలు కాంగ్రెస్‌కు ‘నో’ చెప్పి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వరుసగా అధికారాన్ని అందిస్తున్నారని తెలిపారు.

ప్రజల తీర్పును గౌరవిస్తూ ఈ కుటుంబ వారసత్వ రాజకీయాలు ఎన్నటికీ విజయ వంతం కావని హితవు పలికారు. కాంగ్రెస్ పాలనను దేశం మరచిపోలేదని, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం(Commonwealth Games Scam) దేశ రాజధాని ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసిన వ్యవహారమని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case) ఆ కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రశ్నలు ఇప్పటికీ న్యాయస్థానాల్లో కొనసాగు తున్నాయన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. ఈవీఎంలను తొలగించి, బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాలని అంటున్నారని, మళ్లీ బూత్ క్యాప్చరింగ్ రోజులకే తిరిగి వెళ్లాలా అని ప్రశ్నించారు. 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని, 2004లో, 2009లో ఇదే ఈవీఎంలతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిందన్నారు. అప్పుడు ఎవరూ ఈవీఎంలను ‘మోసం చేసే యంత్రాలు’ అని అనలేదని, రాహుల్‌గాంధీ వరుస ఓటములతో జీర్ణించుకోలేక పసలేని ఆరోపణలతో ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.

కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కేరళంలో కాంగ్రెస్ ఇదే ఈవీఎంలపై గెలిచిందన్నారు. అంటే కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎం సక్రమంగా పనిచేస్తాయని, ఓడిపోయినప్పుడు అదే యంత్రం దొంగగా మారుతుందా?, మారేది యంత్రమా? లేక మీ వైఖరా? అని ప్రశ్నించారు. ‘దేశ అత్యున్నత న్యాయస్థానం ‘నో’ అంటే కోర్టు తప్పు అంటారు. ప్రజలు ‘నో’ అంటే ప్రజలు తప్పు అంటారు. ఎన్నికల సంఘం ‘నో’ అంటే ఎన్నికల సంఘం తప్పు అంటారు. కుటుంబం తప్ప అందరూ తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. 

రాజకీయం చేయొద్దు..

రాజ్యాంగం పేరుతో రాజకీయం చేయడం ఆపాలని ఎంపీ లక్ష్మణ్ హితవు పలికారు. ఈవీఎంలను నిందించడం, ఎన్నికల సంఘాన్ని దూషించడం ఆపాలన్నారు. ప్రజలు మీకు ఓటు వేయనప్పుడల్లా వారు తప్పు చేస్తున్నారన్నట్లుగా భావించడం ఆపాలని సూచించారు. సాకులు చెప్పకుండా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని హితవు పలికారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని, ఈ ప్రగతిని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు