ముంపు సమస్యలకు పరిష్కారం

03-11-2026 | 11:14pm

సాహెబ్ నగర్ డివిజన్ లో పైప్ లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు

ఎల్బీనగర్, నవంబర్ 3: మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్(Former MP Madhuyashki Gowda) కృషితో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రజలకు ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని, ఇందుకోసం నూతన పైప్ లైన్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కేతావత్ రమేశ్ నాయక్ తెలిపారు.

మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపు సమస్య పరిష్కారానికి నూతన పైప్ లైన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5.95 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. బీఎన్ రెడ్డి నగర్‌లోని కాప్రాయి చెరువు నుంచి హయత్ నగర్‌లోని కుమ్మరికుంట వరకు వరద నీటి పైపులైన్ నిర్మాణానికి రూ. 5.95 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు. కాప్రాయి చెరువు పరిసర కాలనీలు గత ఏడాది వర్షాకాలంలో ముంపునకు గురయ్యారని తెలిపారు. 

హరిహరపురం, బీఎన్ రెడ్డి నగర్, శ్రీపురం కాలనీ, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, రంగారెడ్డి కాలనీ, అఖిలాండేశ్వరి నగర్, స్నేహమయి నగర్, పీవీఆర్ కాలనీ, పద్మావతి నగర్, బ్యాంక్ కాలనీ, మైల్‌స్టోన్ తదితర కాలనీలతో పాటు గుర్రంగూడ అటవీ ప్రాంత పరిసర కాలనీలు వరద ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నూతన పైపులైన్ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్య నుంచి విముక్తి లభించనుందని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ నాయక్, ఎస్సీసెల్ అధ్యక్షురాలు భవానీసరస్వతి, నాయకులు చంద్ర కాంత్ గౌడ్, పాటి రాంబాబు గౌడ్, శంకర్ నాయక్, పారంద స్వామి, చిత్త రంజన్,రామకోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు