రెడ్డి x ఓబీసీ

07-10-2026 | 05:25am

కాంగ్రెస్‌లో నెక్ట్స్ సీఎం ఎవరు?

* రాబోయే రోజుల్లో రాష్ట్రానికి బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఇచ్చిన ధైర్యంతోనే ఈ విషయం ఘంటాపథంగా చెబుతున్నాను. బీసీలకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన వాటాను గౌరవప్రదంగా తీసుకుంటాం. అవసరమైతే పోరాడి లాక్కుంటాం. 2039 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం..

నాలుగు రోజుల క్రితం శంషాబాద్‌లో జరిగిన ఓబీసీ సభలో(OBC Meeting) పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్(Mahesh Kumar) 

* రాబోయే 10 సంవత్సరాల పాటు నేనే సీఎంగా ఉంటా. మరో టర్మ్‌కూడా నేనే సీఎంగా కొనసాగుతా. 2034 వరకు సీఎంగా ఉంటా. ఇందులో ఏం అనుమానం లేదు..

 2025 జూలై 18న కొల్లాపూర్‌లో జరిగిన సభలో, మరికొన్ని సందర్భాల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యలు

* ఇటీవల శంషాబాద్‌లో జరిగిన ఓబీసీ సభలో.. రాజకీయాల్లో అగ్రవర్ణాల కింద ఓబీసీలు ఇంకా నలిగిపోవాల్సిందేనా అంటూ ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న తమ పాటలతో ఉర్రూతలూగిస్తూ చేసిన వ్యాఖ్యానాలు.. అగ్రవర్ణాలు, బీసీ వర్గాల మధ్య స్పష్టమైన గీత గీశాయి. మరోవైపు, సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్.. భవిష్యత్తులో బీసీ సీఎం అవుతారని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.

చూడటానికి ఇది బీసీలపై చూపిన ప్రేమాభిమానంగా అనిపించినా, లోతుగా విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తీవ్ర గందరగోళానికి.. రెడ్డి వర్సెస్ బీసీ నాయకత్వ పోరుకు అద్దంపడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, దశాబ్దాలుగా ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న బీసీలను బుట్టలో వేసుకొని, ఆ వర్గాలను మళ్లీ కాంగ్రెస్ ఏం చేయబోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

భవిష్యత్తులో బీసీ సీఎం అంటూ మళ్లీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ప్రకటన

మరి బీసీ సీఎం ఎప్పుడనేది స్పష్టత ఇవ్వని నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నది. రాబోయే కాలంలో ఎవరు సీఎం అనే విషయంలో.. రెడ్డి వర్సెస్ బీసీ(Reddy vs. BC) పోటీని తెరపైకి తీసుకొచ్చి.. అసలు ఎవరు సీఎం అనే విషయంలో స్పష్టత ఇవ్వకుండా గందరగోళ పరిస్థితిని ఏర్పరు స్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈదశలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ‘త్వరలోనే బీసీ సీఎం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతున్నా.. అసలు ఎప్పుడు బీసీ సీఎం అనేది స్పష్ట త లోపించిందని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.

ఒకపక్క సీఎం రేవంత్ రెడ్డి తానే పదేండ్లపాటు సీఎంగా ఉంటానని ఘంటాపథంగా చెబుతున్నప్పుడు.. త్వరలో బీసీ సీఎం అంటూ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు.. బీసీల్లోనే గందరగోళానికి దారితీస్తోంది. ఇదికాస్తా.. రెడ్డి వర్సెస్ బీసీ పోరుగా మారుతో ంది. మహేష్‌కుమార్ ఒకవైపు భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటనలు చేస్తుం టే, మరోవైపు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పదేళ్లు నేనే సీఎం అని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చూస్తే కాంగ్రెస్‌లో అస లు స్పష్టత ఉందా అనే ప్రశ్న తలెత్తోంది. అసలు వీరు చెప్తున్న ‘త్వరలో’ అంటే అర్థమేమిటి? వచ్చే రెండు సంవత్సరాల్లోనా? లేక 2029 ముగిసిన తరువాతనా? లేక 2044 లోనా అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశమవుతోంది.

తెలంగాణ రాజకీయ చరిత్రను ఒకసారి తిరగేస్తే ఒక ఆసక్తికరమైన గణాంకం కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏండ్లు తెలు గుదేశం ప్రభుత్వం (1994--2004), ఆ తర్వాత 10 ఏండ్లు కాంగ్రెస్ పాలన (2004 -2014), తెలంగాణ సిద్ధించాక 10 ఏండ్లు బీఆర్‌ఎస్ (2014--2023) అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ 10 ఏండ్లు అధికారంలో ఉంటామని చెప్తోంది. రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారం కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండి, ఆ తర్వాత బీసీకి అవకాశం ఇస్తామని అంటే 2044 లో బీసీ సీఎం అవుతారా? సమయం, సందర్భం చెప్పకుండా భవిష్యత్తులో అని కాల పరిమితి లేని ప్రకటనలు చేయడం ప్రజలను, ముఖ్యంగా జనా భాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తీవ్రంగా మోసం చేయడమేననే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

జనాభా ప్రాతిపదికన వాటా ఎక్కడ?

తెలంగాణలో బీసీ సామాజిక వర్గం జనాభాలో 50 శాతానికి పైగా ఉందనేది జగద్వి దితం. ఎన్నికల సమయంలో కుల గణన, సామాజిక న్యాయం, ప్రాతినిధ్యం గురించి మాట్లాడే  కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రా గానే సీనియర్ స్థానాల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత తగ్గించడం గమనార్హం. గ తంలోనూ బీసీ ‘డిక్లరేషన్’ పేరుతో హామీలు గుప్పించినప్పటికీ, నిర్ణయాత్మకమైన సీఎం పదవి విషయానికి వచ్చేసరికి మాత్రం దాటవేత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం విధానం వల్ల బీసీ సామాజిక వర్గాల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుంది.

అధిష్ఠానం ముందు సవాళ్లు..

మహేష్‌కుమార్ బీసీ సీఎం ప్రతిపాదన ను తెచ్చిన ఆ సభ వెనుక అనేక అంతర్గత క లహాలు బయటపడ్డాయి. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేల ఆశీస్సులు తమకు ఉన్నాయని చెప్పుకుంటున్నప్పుడు, ఆ మీటింగ్‌కు ఇతర రెడ్డి సామాజిక వర్గ నేతలు గానీ, ఇతర బీసీ ముఖ్య నాయకులు గానీ ఎందుకు రాలే దు? ఇది కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో ఉన్న వర్గపోరును, ఐక్యత లేదనే విషయాన్ని స్ప ష్టం చేస్తోంది. ఇక ఆచరణాత్మక రాజకీయాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది.

నిధుల పంపిణీ, నిర్ణయాధికారాలు, పరిపాలనాధికారాలు ఆయన అధీనంలోనే ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా ప్రభు త్వం ఆయన కనుసైగలతోనే నడుస్తోంది. అలాంటప్పుడు, మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎం పదవిని ఎలా సాధించగలరు? పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఆ స్థాయిలో ఆధిప త్య ం ప్రదర్శించే సత్తా, శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా.. అంటే అందరిలోనూ అ నుమానాలు, పెదవి విరుపే కనపడుతున్నాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ నుంచి అధిష్ఠానం అజమాయిషీ చేసేది. నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇచ్చి.. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే వెసులుబాటు ఉండేది. కానీ, ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. పైగా, జాతీయ కాంగ్రెస్ ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ వంటి కీలక రాష్ట్రాన్ని ఏలుతున్న రేవంత్ రెడ్డి పైనే ఆధారపడి ఉందనేది బహిరంగ రహస్యం. ఇటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డిని కాదని అధిష్ఠానం బీసీ సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా? 2029 ఎన్నికలలో రేవంత్ రెడ్డి నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలిచి అధికారంలోకి రాగలదా అనేది జవాబు లేని ప్రశ్నలేనని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.

వ్యూహాత్మక లోపాలు..

ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం తీరు చూస్తుంటే వారికి బీసీ ఓటు బ్యాంకు చేజారిపోతోందన్న ఆందోళనతో పాటు బీజేపీ ముప్పు ఉందనే భయం కనిపిస్తోంది. బీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పాతకాలపు సోమన్న పాటలు, అగ్రవర్ణాలను తిట్టే విధానాలను ఎంచుకోవడం సరైన వ్యూహం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ఒక సామాజిక వర్గానికి న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, మిగతా వర్గాలను కలుపుకుపోవడం కూడా అంతే ముఖ్యం.

బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలంటే కేవలం బీసీ ఓట్లే సరిపోవు. అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వంటి ఇతర కులాల, వర్గాల ఓట్లు కూడా అత్యవసరం. కేవలం ఆవేశపూరిత ఉపన్యాసాలు, అగ్రవర్ణాలను దూషించడం వల్ల పొలరైజేషన్ పెరిగి బీసీలకే నష్టం జరుగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి చేకూరదు.

దీనితోపాటు రేవంత్ రెడ్డి భవిష్యత్తుపైకూడా స్పష్టత అవసరం. 2029లో రేవంత్ రెడ్డిని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకెళ్తామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనకు ప్రాధాన్యత కలిగిన కేంద్ర మంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేయాలి. ఇది సాధ్యం కాకపోతే.. కనీసం స్పష్టమైన అధికార పంపిణీ (పవర్ షేరింగ్ ఫార్ములా) అయినా ప్రకటించాలి. ప్రస్తుత ఐదేళ్ల కాలంలోనే లేదా 2029 తర్వాతనైనా రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి, మరో రెండున్నర సంవత్సరాలు బీసీ నేత ముఖ్యమంత్రిగా ఉంటారని ఒక స్పష్టమైన అధికార పంపిణీ ఒప్పందాన్ని అధినాయకత్వం ప్రకటించాలి.

అప్పుడే బీసీ సీఎం ఏర్పాటుపై ప్రజల్లో నమ్మకం మొదలవుతుంది. ఈ విధమైన స్పష్టమైన ప్రణాళిక, అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు, బీసీ వర్గాలు కాంగ్రెస్ మాటలను నమ్ముతాయి. అలా కాకుండా, అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకోవడానికి, కాలయాపన చేయడానికి రోజుకో మాట మాట్లాడుతుంటే మాత్రం.. బీసీల నెత్తిన చేయి పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటే అనే భావన ప్రజల్లో మరింత బలపడుతుంది. అంతిమంగా ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేదిగానే మిగులుతుంది.

ప్రజలు నమ్మాలంటే..

రాజకీయాల్లో ఏ ప్రకటనైనా ప్రాక్టికల్ గా ఉండాలి, ప్రజలు నమ్మేలా ఉండాలి. ఊహాజనిత ప్రకటనలు చేయడం మాని, కాంగ్రెస్ పార్టీకి బీసీ సీఎం విషయంలో నిజంగానే నిబద్ధత ఉంటే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఈ చర్యలు ప్రజల్లో నమ్మకం కలిగించేవిగా ఉండాలి. భారీ బహిరంగ సభ నిర్వహించి-.. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేలా చూడాలి. కనీసం 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలి.

ఆ సభకు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కావాలి. అదే వేదికపై నుంచి అధిష్ఠానం అధికారికంగా ప్రకటించాలి. రాహుల్ గాంధీ, ఖర్గేలు స్వయంగా బీసీ సీఎం అంశంపై అధికారిక హామీ ఇవ్వాలి. పైగా బీసీ సీఎం ఎప్పుడనేదానిపై స్పష్టత అవసరం. 2029 ఎన్నికల అనంతరం బీసీ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి.

మరిన్ని వార్తలు