కరెంట్ భారం 5 వేల కోట్లపైనే!

07-10-2026 | 05:30am
  1. ‘ట్రూ-అప్’పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు సర్కార్ సిద్ధం
  2. నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ 
  4. కరెంట్ పాపంలో కమ్యూనిస్టులు భాగస్వామ్యం కావొద్దని వినతి 

అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇప్పటికే కరెంట్ కోతలతో(Power cut) అల్లాడుతున్న ప్రజలు, పెరగనున్న విద్యుత్ చార్జీలతో(Electricity charges) వాతలు పెట్టించుకునే పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగల(Dussehra and Diwali festivals) వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుడి నెత్తిన పిడుగు వేయ నుందని, ట్రూ--అప్ పేరుతో ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ఏకంగా రూ.5,420కోట్లు ప్రజల ముక్కు పిండి వసూలు చేయాలనే ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.

మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఒక దిక్కు ఎల్ నినో, మరోవైపు ధరల పెరుగుదలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాజాగా విద్యుత్ విని యోగదారులపై రూ. 5,420 కోట్ల భారం మోపే హక్కు రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ పోరాటానికి విద్యుత్ అంశమే మూలమన్న విషయా న్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. బషీర్‌బాగ్  కాల్పుల ఘటన చూసి కరెంట్ కష్టాలకు చరమగీతం పాడాలని, రాష్ట్రం రావాలని పదవు లకు రాజీనామా చేసి కేసీఆర్  తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని హరీశ్‌రావు తెలిపారు. 

తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారని. 24 గంటల కరెంట్ ఇస్తామని కేసీఆర్ అంటే జానారెడ్డి కూడా నమ్మలేదని,  కానీ, కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని పేర్కొన్నారు. ‘నేడు  కరెంటు ఉంటే వార్త అయ్యింది. ఈరోజు రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తున్నది. పరిపాలన చేతగాక రేవంత్‌రెడ్డి  చేతులెత్తేసిన పరిస్థితి. పరిపాలనపై ధ్యాస లేదు అనడానికి సంక్షోభంలో కూరుకుపోతున్న విద్యుత్ రంగమే నిదర్శనం. నిర్వహ ణ లోపాలు, నిర్లక్ష్యంతో విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టి.. ఇప్పుడు ఆ భారా న్ని ప్రజలపైకి నెడుతారా?’ అని ప్రశ్నించారు.

మీరు చేసిన తప్పుకు వినియోగదారులు బలి కావాలా?  రెండు నెలల్లోనే  వినియోగదారుల నుంచి రూ. 5 వేల కోట్లు వసూలు చేయడం దు ర్మార్గమని. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు ఎన్నడూ తీసుకోలేదన్నారు. 2016- 17 నుంచి 2021- 22 వరకు ట్రూ- చార్జీ లు రూ.12,718.40 కోట్లు వేయాలని ఇఆ ర్స్సీ చెప్పినా ఈ భారాన్ని వినియోగదారుల పై మోపేందుకు కేసీఆర్ అనుమతించ లేదని గుర్తు చేశారు. కానీ,  ఈ రోజు రేవంత్‌రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ. 5,420 కోట్ల భారం వేస్తున్నడని.

ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన పాలన అని ఆయన మండిపడ్డారు. విద్యుత్ సంస్థలకు రూ.  91,000 కోట్లు కేటాయించి జెన్కో, ట్రా న్స్‌కో అభివృద్ది చేశారని, మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని  7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచి.. అనతి కాలంలోనే రాష్ట్రాన్ని ’పవర్ ఫుల్ తెలంగాణగా నిలబెట్టి అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే స్థాయికి విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేశారని తెలిపారు.

విద్యుత్ వ్యవస్థను చేశాం

‘కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్ల ను 42 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టిం చాం. భద్రాద్రి 1080 మెగావాట్లతో నిర్మిం చాం. 4000 మెగావాట్లతో ఆల్ట్రా థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లిలో 600 మెగావాట్లను ఉత్పత్తి అందుబాటులోకి తెచ్చినం. ఒక్క థర్మల్ లోనే 6480 మెగవాట్లు యాడ్ చేసినం. సోలార్ పవర్ 3600 మెగావాట్లు యాడ్ చేసి విద్యుత్ వ్యవస్థను ఎంతో బలోపేతం చేశాం’ అని హ రీశ్‌రావు తెలిపారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా  ఒక్క సబ్ స్టేషన్ కట్టింది లేదు.. ఒక్క మెగావాటు ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదన్నారు. దేవాదులలో 24 గంటల మో టార్లు నడపకుండా  8 గంటలే నడపడం వ ల్ల  వరంగల్ జిల్లాకు కరవు వచ్చిందన్నారు. 

పవర్ ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం

భద్రాద్రి, యాదాద్రి, సింగరేణి థర్మల్, కేటీపీఎస్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తే, వాటిని నడిపే తెలివి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేద ని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘భద్రాద్రి థర్మ ల్ పవర్ స్టేషన్ మూడో యూనిట్ ఉత్పత్తి ఎందుకు నిలిచిపోయింది. యాదాద్రి పవర్ ప్లాంట్ సామర్థ్యం 4వేల మెగావాట్లు అయి తే 400 కూడా ఉత్పత్తి చేయడం లేదు. సిం గరేణి బొగ్గు సంస్థ ఉండి కూడా సింగరేణి థర్మల్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి. నదుల్లో నీళ్లు ఉన్నా రిజర్వాయర్లు నింపలేదు, నీళ్లు లిఫ్ట్ చేయలేదు.

బొగ్గు ఉన్నా సరఫరా చేయరు, కరెంట్ ఉత్పత్తి చేయరు, రూ. 1600 కోట్లు విలువ చేసే 40 లక్షల మె ట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయం చేసి కుంభకోణానికి పాలుపడ్డారు’ అని విమర్శించారు. కడుపు మండిన రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారని,  కొండారెడ్డి పల్లిలోనే రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదా? అని ప్ర శ్నించారు. కరెంట్ కోతలు, లో ఓల్టేజ్ సమస్యతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలను ఉమ్మడి పాలనలో చూసినం.

నీ పాలనలో మల్లా క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు తెస్తున్నవు. ఆనాటి రోజులు తెస్తాం అన్న రేవంత్‌రెడ్డి, నిజంగానే ఆనాటి కరెంట్ కోతల రోజులు తెచ్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జనరేషన్ కెపాసిటీ 96 మిలియన్ యూనిట్లు అయితే, 39 మిలియన్ యూనిట్లు కూడా దాటడం లేదు? బయట నుంచి రూ. 10 ను ంచి రూ. 12 లకు యూనిట్ కొని ప్రజలపై భారం వేస్తారా?. రాష్ట్రంలో మొత్తం థర్మల్ విద్యుత్ ఇన్టాల్ కెపాసిటీ 13,384 మెగావాట్లు అయితే, 8000 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదు? ’ అని విమర్శించారు. 

బొగ్గు దిగుమతి ఎందుకు

నైనీలో మంచి బొగ్గు  అందుబాటులో ఉ న్నా. విదేశాల నుంచి అధిక ధరకు బొగ్గు ది గుమతి చేసుకోవాలని చూస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. రాహుల్ గాంధీనే మో పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చే యవద్దని, సిడబ్ల్యూసీలో తీర్మానాలు చేస్తారని, ఇక్కడేమో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.  బొగ్గు నిల్వలు చేసుకోవడంలో, రిజ ర్వాయర్లు నింపి థర్మల్, హైడల్  విద్యుత్ ఉత్పత్తి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. నాడు విద్యుత్ బిల్లులపై పోరాటం చేసిన కమ్యూనిస్టులు, ఇప్పుడు  రేవంత్‌రెడ్డి చేసే పాపంలో పాల్పంచుకోవద్దని, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని కోరారు. విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని, రూ.5,420 కోట్ల ఛార్జీలను ప్ర భుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు