రూ. కోట్ల విలువైన భూములు హాంఫట్..!

05-11-2026 | 05:15am
  1. ఇబ్రహీంపట్నంలో  కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల అండదండలు?
  2. ఖానాపూర్, మంగళ్పల్లి, రాందాస్పల్లిలో వేల ఎకరాల ఆక్రమణలు
  3. రియల్టర్ల మాయాజాలం.. ల్యాండ్ గ్రాబింగ్ ముఠాల హల్చల్
  4. ఉన్నతాధికారులు, విజిలన్స్ విచారణకు స్థానికుల డిమాండ్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 4 (విజయక్రాంతి): రాజధాని హైదరాబాద్కు సమీపం లో ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో(Ibrahimpatnam Mandal) భూముల ధరకు(Land prices) విపరీతంగా రెక్కలు రావడం తో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. సర్కారు ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే(revenue officials) అక్రమార్కులతో చేతులు కలిపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కొందరి అక్రమ సంపాదన దాహానికి రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు(Government lands) క్రమంగాఅన్యాక్రాంతమవుతున్నాయి.

సర్వే నంబర్ల వారీగా ఆక్రమణల పర్వం....

స్థానికుల కథనం ప్రకారం మండలంలోని పలు గ్రామా ల్లో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. ఖానాపూర్  లో సర్వే నంబర్లు 80, 81, 82లలో ఉన్న పరంబోకు, ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే సరిహద్దులు మార్చి కబ్జా చేస్తున్నారు.అత్యంత విలువైన సర్వే నంబర్ 96 ప్రభుత్వ భూమిలో కొందరు రియల్టర్లు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రాందాస్ పల్లి సర్వే నంబర్ 86లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

రియల్టర్లతో అధికారుల ములాఖత్!

బడా వ్యక్తులు, స్థానిక రియల్టర్లకు అనుకూలంగా కొందరు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నకిలీ దస్తావే జులు సృష్టించడం, పాత రికార్డుల్లో పేర్లు మార్చడం ద్వారా అక్రమార్కులకు సహకరి స్తూ కొందరు అధికారులు కోట్ల రూపాయ ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రజా ఫిర్యాదులు వచ్చినా కేవలం నామమాత్రపు నోటీసులతో కాలయాపన చేస్తూ, కబ్జాదారులకు సహకరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

వెంచర్ల పేరిట దగా...

హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారికి చేరువలో ఉండటంతో ఈ ప్రాంతంలో రి య టల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. దీ నిని ఆసరాగా చేసుకుని లేఅవుట్లు వేసే క్ర మంలో పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను, కుంటలను వెంచర్లలో కలిపేసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందిస్తారా?...

ఈ ఆక్రమణలపై కలెక్టర్, విజిలెన్స్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక వి చారణ బృందాలను రంగంలోకి దించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. ఖా నాపూర్, మంగళ్పల్లి, రాందాస్పల్లి గ్రామాల్లోని ఆయా సర్వే నంబర్లను సమగ్రంగా డిజిటల్ సర్వే చేసి, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్రమాలకు సహకరించిన అధికారులపై, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నా రు.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేల్కొని విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు