నిరుద్యోగులకు ‘ఐక్యత’ ఆసరా

14-10-2026 | 05:10am
  1. ఐక్యత ఫౌండేషన్ 25వ జాబ్ డ్రైవ్ సూపర్ హిట్
  2. తరలివచ్చిన 600 మంది 
  3.    347 మందికి ముగిసిన ఇంటర్వ్యూ
  4. గ్రామీణుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం 
  5. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి 

ఆమనగల్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు లేక నిరుద్యోగంతో నలిగిపోతున్న యువతీ యువకులకు ఐక్యత పౌండేషన్(Aikyata Foundation) ఆశా కిరణంగా మారింది. ముఖ్యంగా నియోజకవర్గంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు(Job Opportunities) కల్పించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి(Sunkireddy Raghavender Reddy) చేపడుతున్న ’ఉపాధి డ్రైవ్లు’ సరికొత్త ఆశలు నింపుతున్నాయి. మంగళవారం ఆమనగల్లోని ఐక్యత ఫౌండేషన్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 25వ ప్రత్యేక జాబ్ డ్రైవ్కు నిరుద్యోగ యువత నుంచి అపూర్వ స్పందన  వచ్చింది.

కల్వకుర్తి నియోజకవర్గ(Kalvakurthi Constituency) పరిధిలోని వివిధ గ్రామాల నుంచి 600 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఉత్సాహంగా హాజరుకాగా.. వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు 347 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అర్హత, నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

ఒక్కరి కి ఉద్యోగం.. ఆ కుటుంబానికే వెలుగు...

 గ్రామీణ యువతలో నైపుణ్యాలకు, ప్రతిభకు ఏమాత్రం కొదవ లేదు. కానీ, సరైన ప్లాట్ఫారమ్ లేక చాలామంది అవకాశాలకు దూరమవుతున్నారు. ఒక కుటుంబంలో ఒక్క యువకుడికి లేదా మహిళకు ఉద్యోగం వస్తే, ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులే మారిపోతాయి.ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది.మహిళల సాధికారత, యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించడమే ఐక్యత ఫౌండేషన్ ముందడగు వేసింది.ఈ జాబ్ డ్రైవ్లను కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా నిజమైన ఉపాధి వేదికలుగా మారుస్తు ఆ కుటుంబాలల్లో వెలుగులు నిపుతున్నారు.

సుంకిరెడ్డి కృషి అభినందనీయం : కంపెనీల ప్రతినిధులు

జాబ్ డ్రైవ్లో పాల్గొన్న వివిధ కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నేరుగా ప్రముఖ కంపెనీల ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం కల్పించడంలో సుంకిరెడ్డి  చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, ప్రతిభకు తగినట్లుగా ఉద్యోగాలు పరిచయం చేస్తూ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తున్నారని వారు కొనియాడారు.

మరిన్ని వార్తలు