చాకరిమెట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

11-11-2026 | 09:56pm

శివంపేట నవంబర్ 11( విజయక్రాంతి): శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ(Village Panchayat) పరిధిలోని చాకరిమెట్ల శ్రీ స్వయంభూ సహకార ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీపోత్సవ పూజలు ముగిసిన అనంతరం భక్తులకు పసుపు, కుంకుమ, తాంబూలం, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఈవో సారా శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ ఆంజనేయ శర్మ, సాయి ప్రసాద్ శర్మ, రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మరిన్ని వార్తలు