ఖరీజ్ ఖాతా భూములపై ఆరోపణలు
కుకునూరుపల్లి తహసీల్దార్‌పై విచారణకు బాధితుల డిమాండ్
కొండపాక, నవంబర్ 11 (విజయక్రాంతి): కుకునూరుపల్లి మండలం మంగోలు గ్రామంలోని 512, 514 సర్వే నంబర్ల ఖరీజ్ ఖాతా భూముల(Lands under the Kharij account) వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 1999 నుంచి నిలిపివేసిన రిజిస్ట్రేషన్ల బ్లాక్‌ను తొలగించి స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్నారని గ్రామానికి చెందిన మహమ్మద్ సమీర్ తహసీల్దార్ వేణుగోపాల్ రావుపై ఆరోపించారు.
జాయింట్ కలెక్టర్, హైకోర్టు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా రిజిస్ట్రేషన్లకు ఎలా ప్రయత్నిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నతస్థాయి విచారణ కోరారు.
అధికారుల ఖండన
ఈ ఆరోపణలను తహసీల్దార్ వేణుగోపాల్ రావు ఖండించారు. ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేవని స్పష్టం చేశారు.