క్రీడల కంటే రాజకీయాలే ఎక్కువ

08-11-2026 | 05:05am
  1. శాట్స్ తీరుపై అర్జున అవార్డీ రవికాంత్‌రెడ్డి ఆగ్రహం
  2. క్రీడాభివృద్దిని గాలికొదిలేశారు
  3. కొందరు శాట్స్‌ను జాగీరులా భావిస్తున్నారు
  4. తెలంగాణ ఒలింపిక్ సంఘంపైనా విమర్శలు

హైదరాబాద్, నవంబర్ 9 : క్రీడాభివృద్దిపై(Sports Development) దృష్టి పెటాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(Sports Authority of Telangana)(శాట్స్)లో రాజకీయాలు ఎక్కువయ్యాయని మాజీ వాల్‌బాల్ ప్లేయర్, అర్జున అవార్డీ(Arjuna Awardee), ఖేలో ఇండియా నేషనల్ డైరెక్టర్ రవికాంత్ రెడ్డి(Ravikanth Reddy) విమర్శించారు. కొందరు అధికారులు  శాట్స్‌ను సొంత జాగీరులా భావిస్తూ అజమాయిషీ చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను, ఇతర అంశా లను గాలికొదిలేసి కొందరికి తొత్తుల్లా మారారని మండిపడ్డారు.

వీరి వైఖరితో చివరికి క్రీడాకారులే నష్టపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అటు తెలంగాణ ఒలింపిక్ సంఘం తీరుపైనా రవికాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం టీవోఏలో రెండు గ్రూపులు ఏర్పడడం, గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్వ యంగా తెలంగాణ ఒలింపిక్ సం ఘం తీరును తప్పుపడుతూ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు.

ఐవోఏ నిబంధనలతో ఎన్నికలు నిర్వహించాలని ప్రెసిడెంట్ పీటీ ఉష లేఖ రాసినా ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు లేకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరవెనుక కొందరు వ్యక్తులు ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘంలోనూ కొందరు వ్యక్తులు అర్హత లేకున్నా పదవుల్లో కొనసాగుతూ రాజకీయాలు చేస్తూ క్రీడావ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టీవోఏ తీరు ను వచ్చే నెలలో ఐవోఏ దృష్టికి తీసుకెళాతామన్నారు.

ఇదిలా ఉంటే ఖేలో ఇండియా లాంటి అతిపెద్ద ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం వచ్చినా సరైన ఏర్పాట్లు జరుగుతున్నట్టు కనిపించడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ద్వారా క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నా రు. ఇలాంటి హబ్‌లో తాను కూడా భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శాట్స్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ రాజకీయాలను పక్కన పెట్టి క్రీడాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

మరిన్ని వార్తలు