ఆస్ట్రేలియాదే తొలి టీ20
మెల్బోర్న్, నవంబర్ 21: ఇంగ్లాండ్తో(England) జరుగుతున్న టీ20 సిరీస్లో(T20 series) ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మెల్బోర్న్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొద ట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ త్వరగానే సాల్ట్, డొనాల్డ్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 20 బం తుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, ఆస్ట్రేలియా పై ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ రికార్డును సృష్టిం చాడు.
మొత్తం 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు.చివర్లో ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి 20 ఓవర్లలో 187 పరుగులు చేయగలిగింది. నిఖిల్ చౌదరి (2/21), జాక్ ఎడ్వరడ్స్ (2/27) రాణించారు.188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడినా నిఖిల్ చౌ దరి ఆదుకున్నాడు. తన తొలి అంతర్జాతీయ టీ20 అర్ధ సెంచరీతో (38 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.