కంగారూల చేతిలో సఫారీలు చిత్తు
తొలి టెస్టులో ఆసీస్ ఘనవిజయం
డర్బన్, అక్టోబర్ 13 : దక్షిణాఫ్రికా పర్యటనను(South Africa tour) ఆస్ట్రేలియా(Australia) ఘనంగా ఆరంభించింది. ఆరంభంలో తడబడినా అద్భుతంగా పుంజుకుని తొలి టెస్టులో(First Test) సఫారీలను చిత్తుగా ఓడించింది. ఏకంగా 214 పరుగుల తేడాతో ఆసీస్ ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా రెన్షా సెంచరీతో 390 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బౌలింగ్లోనూ అదరగొట్టి 284 పరుగులకే దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో 314/6 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెన్షా(82) మరోసారి రాణించాడు.
తర్వాత 421 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 206 పరుగులకే ఆతిథ్య జట్టు కుప్పకూలింది. మార్క్మ్ 75 పరుగులు తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హ్యాజిల్వుడ్ 6 వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం నుంచి రెండో టెస్ట్ మొదలుకానుంది.