హర్మన్ స్మృతికి అండగా నిలవాలి
బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ సూచన
ముంబై, అక్టోబర్ 14: భారత మహిళల క్రికెట్లో(Indian womens cricket) సుదీర్ఘకాలం పాటు జట్టును విజయవంతంగా నడిపిన హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టె న్సీ(Harmanpreet Kaur's captaincy) బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Star opener Smriti Mandhana) జట్టు బాధ్యతలను స్వీకరించింది. జింబాబ్వేతో జరగనున్న సిరీస్‌తో మంధాన కెపెన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్(BCCI President Mithun Manhas) కీలక వ్యాఖ్యలు చేశారు. స్మృతి మందానకు హర్మన్‌ప్రీత్ కౌర్ అండగా నిలవాలని సూచించారు.
భారత పురుషుల జట్టులో విజయవంతమైన కెప్టె న్సీ మార్పిడి విధానాన్ని ఇక్కడ గుర్తుచేశారు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుం చి తప్పుకున్న తర్వాత కూడా విరాట్ కోహ్లీకి మైదానంలో ఎంతగానో సహాయపడ్డాడనీ, ఫీల్డింగ్ మార్పులు, డీఆర్ఎస్ నిర్ణయాలు, బౌలింగ్ మార్పులలో ధోనీ వెన్నంటి ఉండి నడిపించిన తీరును మన్హాస్ గుర్తు చేశారు.
అదేవిధంగా గంగూలీ ధోనీకి, ధోనీ.. కోహ్లీ, రోహిత్‌కు, ఇప్పుడు రోహిత్ - విరాట్ కలిసి శుభ్‌మన్ గిల్‌కు దిశానిర్దేశం చేస్తున్న సంప్రదా యం మహిళా క్రికెట్లోనూ కొనసాగాలని ఆయన అన్నారు. కెప్టెన్సీ అనేది ఎంత అనుభవం ఉన్న ఆటగాడికైనా ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారమని మన్హాస్ అభిప్రాయపడ్డారు. మైదానంలో క్లిష్ట పరిస్థితులు ఎ దురైనప్పుడు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం నెలకొన్నప్పుడు హ ర్మన్ వంటి సీనియర్ ప్లేయర్ పక్కన ఉండ టం మంధానకు అండగా నిలుస్తుందన్నారు.