ఉత్సాహంగా టీసీఏ అండర్-19 లీగ్

15-10-2026 | 05:25am

వరంగల్, అక్టోబర్ 14, 2026: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) ఆధ్వ ర్యంలో వరంగల్‌లోని కాకతీ య యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న టీసీఏ అండర్(TCA Under)-19 రాష్ట్ర స్థాయి లీగ్-2026 పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీసీఏ అండర్-19 బెల్లంపల్లి జట్టు(Bellampalli Team), టీసీఏ అండర్-19 భూపాలపల్లి జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భూపాలపల్లి జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ నందు 65 పరుగులతో రాణించగా, ఎం. రిత్విక్ 31 పరుగులు సాధించాడు.

అనంతరం 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెల్లంపల్లి జట్టు 23.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బె ల్లంపల్లి జట్టు తరఫున రిత్విక్ ఆర్. 37 పరుగులు, ప్రీతమ్ 28 పరుగులు, సిద్ధూ 23 పరుగులు, మోక్షిత్ 20 పరుగులతో కీలక ఇన్నింగ్సలు ఆడారు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన బెల్లంపల్లి జట్టు ఆటగాడు జి. వినిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి, గ్రామీణ ప్రాంతా ల క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ క్రికె ట్ అసోసియేషన్ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు