చిన్మయ్ సుతార్ ప్రపంచ రికార్డు

05-11-2026 | 05:05am

వల్లభ విద్యానగర్, నవంబర్ 4 : దేశవాళీ క్రికెట్‌లో(Domestic cricket) మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్(Chinmay Sutar) చెలరేగిపోతున్నాడు. రంజీ ట్రోఫీలో(Ranji Trophy) వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా తన అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుతార్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో 175 పరుగులు చేసిన అతడు కెరీర్‌లో మొద టి 5 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

5 ఇన్నింగ్స్‌లలో సుతార్ 834 పరుగులు చేశాడు. అంతకుముందు మొద టి 5 ఇన్నింగ్స్‌లల్లో 748 పైచిలుకు పరుగులు చేసి బిల్ పాన్సోర్డ్ ఉన్నాడు. రంజీ ట్రోఫీలో వరుసగా 3 సెంచరీలు సాధించి అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు నాగాలాండ్‌పై 400 రన్సతో రంజీ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 

మరిన్ని వార్తలు