ప్రపంచకప్‌తో విమర్శలకు చెక్

07-10-2026 | 05:25am

పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్(Women's Cricket) అయినా ప్లేయర్‌గా ఎంత మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా సారథిగా పెద్ద టోర్నీలు గెలవకుంటే విమర్శలు వస్తుంటాయి. ఇలాంటి విమర్శలను హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) చాలానే ఎదుర్కొంది. మిథాలీరాజ్, ఝులన్ గోస్వామి(Mithali Raj, Jhulan Goswami) వంటి సారథులను చూసిన తర్వాత బాధ్యతలు అందుకున్న హర్మన్‌పై సహజంగానే అంచనాలు పెరిగాయి.అయితే ఆమె కెప్టెన్సీలో(Captaincy) పెద్దగా పస లేదని, జట్టును నడిపించడం కష్టమేనంటూ ఆరంభంలో విమర్శలు వచ్చాయి.

అనుకోని విధంగా తాత్కాలిక సార థ్య బాధ్యతలు అందుకున్నప్పుడు ఆసియాకప్ గెలిపించింది. తర్వాత క్రమంగా కెప్టెన్సీ ఒత్తిడి ఎదుర్కొంటూనే వ్యక్తిగతంగానూ రాణించింది. ఇదిలా ఉంటే 2025 ప్రపంచకప్ భారత మహిళల క్రికెట్‌లోనే అతిపెద్ద విజయం. తన కెప్టెన్సీపై విమర్శలు చేసిన వారికి ఆటతోనూ, నాయకత్వంతోనూ సమాధానమిస్తూ వరల్డ్‌కప్‌ను గెలిపించింది. 

మరిన్ని వార్తలు