కెప్టెన్‌గా యశ్వీర్‌గౌడ్

22-11-2026 | 05:15am

కూచ్ బెహర్ ట్రోఫీకి  హైదరాబాద్ జట్టు ప్రకటన

హైదరాబాద్, నవంబర్ 21: వచ్చే వారం ప్రారంభం కానున్న కూచ్ బెహర్ ట్రోఫీ(Cooch Behar Trophy) కోసం హైదరాబాద్ అండర్ 19 జట్టును ప్రకటించారు. ఆల్‌రౌండర్ వి.యశ్వీర్ గౌడ్ కెప్టె న్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అండర్ 19 ఆసియాకప్‌లో(Asia Cup) భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యశ్వీర్ కొంతకాలంగా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది కూడా కూచ్ బెహర్ ట్రోఫీలో ప లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు.

ఈ టోర్నీ లో హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో ఛండీఘడ్‌తో తలపడనుంది. నవంబర్ 26 నుంచి 29 వరకూ ఛండీఘడ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ జట్టులో యువ ఆల్‌రౌండర్ ఎస్.నిపుణ్ రెడ్డి కూడా చోటు దక్కించుకున్నాడు.  కొంతకాలంగా నిపు ణ్ రెడ్డి నిలకడైన ప్రదర్శనలతో రాణిస్తున్నాడు.

హైదరాబాద్ అండర్ 19 జట్టు  : వి.యశ్వీర్‌గౌడ్(కెప్టెన్), ఆదిత్య వర్థన్, రోషన్, శివరామకృష్ణ, పల్లి ప్రిన్స్, రామ్‌చరణ్, ఆదిత్య. దుర్గా ఉజ్వల్, వేద్ రెడ్డి, హరి ఓం సింగ్, దేవ్ ఎం మెహతా, ఎస్. నిపుణ్‌రెడ్డి, ఆయుశ్, పార్థశర్మ, ఆదిత్య మల్హోత్ర

మరిన్ని వార్తలు