నేడే భారత్ ఏ, పాక్ ఏ పోరు

22-11-2026 | 05:25am

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ

దోహా, నవంబర్ 21: ప్రపంచ క్రికెట్‌లో(World cricket) భారత్, పాకిస్తాన్ జట్లు ఎప్పుడు ఎక్కడ తలపడినా అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. తా జాగా మరోసారి చిరకాల ప్రత్యర్థుల మధ్య హైవోల్టేజ్ ఫైట్ జరగబోతోంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ఎ, పాక్ ఎ జట్లు తలపడబోతున్నాయి. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో(West End Park International Cricket Stadium) ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ తమ తొలి మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించి జోరు మీదుండడంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగే అవకాశం ఉంది.

తిలక్ వర్మ సారథ్యంలోని భారత యువ జట్టు ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌ను 303 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వంటి అంతర్జాతీయ అనుభ వం ఉన్న ఆటగాళ్లతో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. నేపాల్‌పై కుమార్ కుశాగ్ర (117), తిలక్ వర్మ (107) సెంచరీలు చేయగా, ప్రిన్స్ యాదవ్ (5 వికెట్లు), హర్షిత్ రాణా (4 వికెట్లు) బౌలింగ్‌లో సత్తా చాటారు. మరోవైపు అబ్దుల్ సమద్ నేతృత్వంలోని పాకిస్తాన్ యువ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 

మరిన్ని వార్తలు