సెమీఫైనల్లో భారత్
- మలేషియాపై ఘనవిజయం
- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ
జలంధర్, నవంబర్ 1 : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో(Asian Champions Trophy Hockey Tournament) భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా నాలుగో విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆస క్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 స్కోర్ తేడాతో మలేషియాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ హాట్రిక్ గోల్స్ సాధించాడు.
మ్యాచ్ 3వ నిమిషంలో, ఆ తర్వాత సెకండ్ హాఫ్‌ల్లో లభించిన పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ చేసిన హర్మన్‌ప్రీత్ మ్యాచ్ ము గిసే సమయానికి పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్గా మార్చి తన హాట్రిక్‌ను పూర్తి చేశాడు. మ్యాచ్ 43వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్ లభించిన అవకాశాన్ని రివర్స్ స్టిక్ షాట్‌తో భారత్‌కు మరో కీలకమైన ఫీల్ గోల్‌ను అందించాడు.
మలేషియా జట్టు తరఫున అన్వర్ అఖిము ల్లా 25వ నిమిషంలో ఒక గోల్ చేసి స్కోరు ను సమం చేయగా, మ్యాచ్ ముగిసే ఆఖరి క్షణాల్లో షెల్లో సిల్వేరియస్ మరో గోల్ సా ధించాడు. ఈ విజయంతో డిఫెండింగ్ ఛాం పియన్ అయిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా సెమీఫైనల్ బెర్తును కూడా ఖాయం చేసుకుంది.