క్వార్టర్స్‌లో రక్షిత ఓటమి
హాంకాంగ్, నవంబర్ 20: హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం రక్షిత శ్రీ రామ్ రాజ్(Indian shuttler Rakshita Sri Ram Raj) పోరాటానికి తెరపడింది. సంచలన విజయాలతో అదరగొట్టిన ఈ యువ షట్లర్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. థాయిలాండ్ క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువాంగ్ 19- 16 తేడాతో వరుస గేమ్‌లలో రక్షితపై విజయం సాధించింది. ఈ క్వార్టర్ ఫైనల్ ఓటమికి ముందు, 19 ఏళ్ల రక్షిత ఈ టోర్నీలో సంచలన ప్రదర్శన కనబరిచింది.
ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ నంబర్ 4 క్రీడాకారిణి చెన్ యు ఫీ (చైనా)పై 21- 24 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. తద్వారా తన కెరీర్లో తొలిసారిగా సూపర్ 500 క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు తొలి రౌండ్లో డెన్మార్క్ క్రీడా కారిణి మియా బ్లిచ్ఫెల్డ్ట్ను ఓడించింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రక్షిత, తన కెరీర్ ప్రారంభంలో అక్కడే ఆడటం మొదలుపెట్టి, మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌కు మారింది. ప్రస్తుతం హైదరా బాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసు కుంటోంది.