నేటి నుంచే ఇటాలియా టీ10 లీగ్

20-11-2026 | 05:05am

వెనిస్, నవంబర్ 19: క్రికెట్ సరికొత్త ఫార్మాట్ టీ10లో మరో లీగ్ అభిమానులను అలరించబోతోంది. వెనిస్ నగరం వేదికగా ఇటాలియా ప్రీమియర్ లీగ్(Italian Premier League) శుక్రవారం నుంచే మొదలుకాబోతోంది. ఈలీగ్‌లో పలువురు భారత క్రికెటర్లు, మాజీలు భాగస్వా ములుగా ఉన్నారు. లీగ్‌లో ఒక జట్టుగా ఉన్న వెనిస్ లైవ్‌వైర్స్ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త టీఎన్ ఆర్ మోహిత్ ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు.

వెనిస్ లైవ్‌వైర్స్ జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ డేవిడ్ మలాన్ సారథిగా ఎంపికయ్యాడు. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. భారత క్రికెటర్లు కేసీ కరియప్ప, విజయ్ శంకర్ కూడా జట్టులో ఉన్నారు. టీఎన్‌ఆర్ మోహి త్ మాట్లాడుతూ ఇంత ప్రతిభావంతులైన అంతర్జాతీయ క్రికెటర్లను ఒకే జట్టులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జట్టు డైరెక్టర్ ఎం ఎస్‌కే ప్రసాద్ మాట్లాడు తూ మ్యాచ్‌లను గెలిపించే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లతో  జట్టును రూపొందించామని చెప్పారు. 


మరిన్ని వార్తలు